హరియాణాపై యూపీ యోధ విజయం

హరియాణాపై యూపీ యోధ విజయం

ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో హరియాణా స్టీలర్స్‌పై యూపీ యోధ విజయం సాధించింది. ప్రొకబడ్డీ లీగ్‌లో గురువారం జరిగిన మ్యాచ్‌లో యూపీ యోధ జట్టు 30-29తో హరియాణా స్టీలర్స్‌పై గెలుపొందింది. యోధ జట్టులో శ్రీకాంత్‌, ప్రశాంత్‌ చెరో 8 పాయింట్లు సాధించారు. హరియాణా తరుపున మోను 11 పాయింట్లు, వికాస్ 7 పాయింట్లు చేసినా హరియాణాకు ఓటమి తప్పలేదు.  గురువారం జరిగిన మరో మ్యాచ్‌లో ఢిల్లీ దబాంగ్‌ జట్టు 37-33తో తమిళ్‌ తలైవాస్ పై విజయం సాధించింది.