మోడీ కేబినెట్‌కు కేంద్ర మంత్రి గుడ్‌బై?

మోడీ కేబినెట్‌కు కేంద్ర మంత్రి గుడ్‌బై?

కేంద్ర మానవ వనరుల శాఖ సహాయ మంత్రి ఉపేంద్ర కుశ్వా కేంద్ర కేబినెట్‌ నుంచి వైదొలగే అవకాశముంది. బీహార్‌ రాజకీయాల దృష్ట్యా మోడీ కేబినెట్‌ నుంచి వైదొలగాలని ఆయన భావిస్తున్నారు. బీహార్‌కు చెందిన రాష్ట్రీయ లోక్‌ సమతా పార్టీ (ఆర్‌ఎల్‌ఎస్పీ) అధ్యక్షునిగా ఉన్న ఉపేంద్ర ఈనెల 10న లేదా ఆలోపే కేబినెట్‌ నుంచి వైదొలగే అవకాశముంది. కేంద్రంలోని మోడీ ప్రభుత్వంపై, బీహార్‌లో నితీష్‌ కుమార్‌ ప్రభుత్వం ఉపేంద్ర నిన్న తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇప్పటి వరకు బీజేపీతో, కేంద్ర మంత్రి రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌కు చెందిన లోక్‌ జనశక్తి పార్టీతో తమ పార్టీ సంబంధాలు తెగినట్లేనని ఆయన చెప్పారు. 2014 నుంచి తాము ఎన్డీఏలో ఉన్నామని, గత ఏడాది ఎన్డీఏలోకి వచ్చిన నితీష్‌ కుమార్‌ తమపై పెత్తనం చెలాయించడాన్ని సహించే ప్రసక్తేలేదని ఆయన స్పష్టం చేశారు.