వీడియోః ఆహారం బాగోలేదని హోటల్ సిబ్బందిని చితక్కొట్టారు

వీడియోః ఆహారం బాగోలేదని హోటల్ సిబ్బందిని చితక్కొట్టారు

పశ్చిమ ఢిల్లీలోని జనక్ పురిలో జరిగిన ఓ పెళ్లివేడుక రణరంగంగా మారింది. ఆహారం వడ్డించిన హోటల్ సిబ్బందిపై పెళ్లికొడుకు తరఫు అతిథులు పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. ఇంతకు కారణమేంటంటే వడ్డించిన ఆహార పదార్థాలేవీ అతిథుల నోటికి రుచించలేదట.

ఆన్ లైన్ లో పోస్ట్ చేసిన వీడియో చూస్తే అది పెళ్లా లేదా డబ్ల్యుడబ్ల్యుఎఫ్ పోటీయా అనే అనుమానం వస్తుంది. దాడికి దిగిన అతిథులు హోటల్ లో విధ్వంసం సృష్టించారు. కనిపించిన వస్తువునల్లా ముక్కలు చేస్తూ ఎదురొచ్చిన హోటల్ సిబ్బందిని చితకబాదారు. వీడియోలో కనిపించే దృశ్యాలు చూస్తే అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొన్నట్టు స్పష్టంగా తెలుస్తోంది.

వడ్డించే ప్రదేశంలో ఒకళ్లనొకళ్లు లాగుతూ, నెడుతూ, ఒకరితో ఒకరు బాహాబాహీకి తలపడ్డారు. ఈ యుద్ధంలో లక్షల విలువైన ఫర్నీచర్, వడ్డన సామాగ్రి, ఇతర వస్తువులు ధ్వంసమయ్యాయి. 

జనక్ పురిలోని పికాడిలీ హోటల్ లో ఈ సంఘటన చోటు చేసుకొంది.