యూరి @ 200 కోట్లు

యూరి @ 200 కోట్లు

ఈ మధ్యకాలంలో బాలీవుడ్ లో మీడియం రేంజ్ సినిమాలు భారీ వసూళ్లు సాధిస్తున్నాయి.  బదాయి హో సినిమా ఇలాగే భారీ వసూళ్లు సాధించింది.  రీసెంట్ గా వచ్చిన యూరి సర్జికల్ స్ట్రైక్స్ సినిమా కూడా ఇలాగే భారీ వసూళ్లు సాధించింది.  

విక్కీ డోనర్ సినిమాతో భారీ సక్సెస్ అందుకున్న విక్కీ కౌశల్ హీరోగా చేసిన ఈ సినిమా అంచనాలకు మించి హిట్ అయింది.  మొదటి రెండు మూడు రోజులు కలెక్షన్లు మామూలుగానే ఉన్నా.. ఆ తరువాత వసూళ్లు ఊపందుకున్నాయి.  రిలీజైన 23, 24 వ రోజున బాహుబలి 2 వసూళ్లను బీట్ చేసి వార్తల్లోకి వచ్చింది.  వీకెండ్స్ లోనే కాకుండా మామూలు రోజుల్లో కూడా మంచి వసూళ్లు సాధిస్తున్న యూరి సినిమా రూ.200 కోట్ల క్లబ్ లో చేరి మరో రికార్డును సొంతం చేసుకుంది.