స్థాయి సంఘం ఎదుట ఉర్జిత్‌ పటేల్‌

 స్థాయి సంఘం ఎదుట ఉర్జిత్‌ పటేల్‌

ఆర్థిక శాఖపై ఏర్పాటైన పార్లమెంటు స్థాయి సంఘం ఎదుట ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ హాజరు కానున్నారు. వీరప్ప మొయిలీ నేతృత్వంలోని స్థాయి సంఘం దేశంలో బ్యాంకింగ్‌ రంగ పరిస్థితి గురించి ఉర్జిత్‌ పటేల్‌ను ప్రశ్నించనుంది. బ్యాంకుల్లో పెరిగిపోతున్న ఎన్‌పీఏల సమస్యపై సభ్యులు కూడా పలు ప్రశ్నలు వేయొచ్చని తెలుస్తోంది. నోట్ల రద్దు సమయంలో తీవ్ర నోట్ల కొరతను జనం ఎదుర్కొన్నారు. ఇప్పటికీ నోట్ల కొరత ఉండటంపై  కొందరు సభ్యులు ఉర్జిత్‌ను అడిగే అవకాశముంది. ముఖ్యంగా పీఎన్‌బీ స్కామ్‌ గురించి ఉర్జిత్‌ పటేల్‌కు పలు క్లిష్టమైన ప్రశ్నలు ఎదురుకావొచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్‌, చందా కొచ్చర్‌ అంశం కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశముంది.