భారత్ కు యూఎస్ అపాచీ హెలికాప్టర్లు

భారత్ కు యూఎస్ అపాచీ హెలికాప్టర్లు

భారత సైన్యానికి ఆరు అపాచీ యుద్ధ హెలికాప్టర్లను విక్రయించేందుకు అమెరికా ప్రభుత్వం అంగీకారం తెలిపింది. 930 మిలియన్‌ డాలర్ల వ్యయం చేసే 'ఏహెచ్‌-64ఈ' అపాచీ అటాక్‌ హెలికాప్టర్లను విక్రయించేందుకు ఒప్పందం కుదిరింది. ఈ విషయాన్ని అగ్రరాజ్య విదేశాంగ శాఖ వెల్లడించింది. అమెరికా  ప్రజా ప్రతినిధులు ఎవరూ దీనిపై అభ్యంతరాలు తెలపకపోతే ఈ ఒప్పందం ముందుకు వెళ్లనుంది. భారత్‌లో ఏర్పాటు చేసిన ప్లాంట్‌లోనే బొయింగ్‌, టాటా సంస్థలు కలిసి అపాచీ హెలికాప్టర్‌కు ప్రధాన బాడీని తయారు చేస్తున్నాయి. పూర్తి హెలికాప్టర్లను మాత్రం అమెరికా నుంచి నేరుగా ఈ ఒప్పందం ద్వారా కొనుగోలు చేయనున్నారు. 

హెలికాప్టర్లతో పాటు అత్యాధునిక నైట్‌ విజన్‌ సెన్సార్లు, జీపీఎస్‌ గైడెన్స్‌, స్ట్రింగర్‌ ఎయిర్‌-టు-ఎయిర్‌ క్షిపణులు కూడా సమకూరనున్నాయి. అపాచీ హెలికాప్టర్లతో భారత రక్షణ సామర్థ్యం మరింత బలోపేతం కానుందని యూఎస్‌ డిఫెన్స్‌ సెక్యూరిటీ కోఆపరేషన్‌ ఏజెన్సీ తెలిపింది. 2015లో భారత్, అమెరికా పదేళ్ల పాటు  డిఫెన్స్ ఫ్రేమ్ వర్క్ పై అంగీకారం కుదిరింది. ఇందులో భాగంగానే అపాచీ హెలికాప్టర్ల విక్రయ ఒప్పదం. దీంతోపాటు  ఇంటర్నేషనల్ ఎడుకేషన్ అండ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో కూడా భారత్ పాల్గొననుంది.