కొత్త సిమ్‌కి ఆధార్ అవసరం లేదు, కానీ...

కొత్త సిమ్‌కి ఆధార్ అవసరం లేదు, కానీ...

ఇక కొత్త సిమ్ కొనాలంటే ఆధార్ నెంబర్‌తో పనిలేదంటోంది టెలికం శాఖ... సిమ్‌ కార్డుల నుంచి పాన్ కార్డులు, బ్యాంకు ఖాతాలు, గ్యాస్... ఇలా అన్నింటికీ ఆధార్ నెంబర్ లింక్ చేయాలంటూ ఆదేశాలు వచ్చినా... అవసరంలేదంటూ కోర్టు తీర్పులు వెలువడ్డాయి. మరోవైపు ఆధార్ భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి... ఈ నేపథ్యంలో కొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకవస్తోంది టెలికం శాఖ. ఆధార్ నెంబర్ స్థానంలో వర్చువల్ ఐడీగా పిలిచే నెంబర్‌ను ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఆధార్ నెంబర్ ఇవ్వకుండా పర్చువల్ ఐడీ ఇస్తే సరిపోతుంది. ఈ మేరకు యూఐడీఏఐ... టెలికం శాఖకు ఆదేశాలు జారీ చేసింది. దీనిని అమలు చేసేందుకు టెలికం ఆపరేటర్లు సిద్ధమవుతుండగా... జూలై 1వ తేదీ నుంచి ఈ పద్ధతి అందుబాటులోకి రానుంది. ఆధార్‌ నెంబర్ ద్వారా వర్చువల్ ఐడీలో నెంబర్ పొందవచ్చు. యూఐడీఏఐ సైట్‌లో వర్చువల్ ఐడీ నంబర్‌ను జనరేట్ చేసుకోవాల్సి ఉంటుంది.