ఎవరూ హైకోర్టు ఆదేశాలను పట్టించుకోవడంలేదు:ఉత్తమ్

ఎవరూ హైకోర్టు ఆదేశాలను పట్టించుకోవడంలేదు:ఉత్తమ్

రాజ్‌భవన్‌లో ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ను తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు కలిశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌ల శాసనసభ సభ్యత్వంపై హైకోర్టు తీర్పును ప్రభుత్వం అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను కోరినట్లు తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌‌కుమార్‌ రెడ్డి తెలిపారు. అనంతరం ఉత్తమ్ మాట్లాడుతూ... హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చి 20 రోజులు అయినా రాష్ట్ర ప్రభుత్వంగాని, శాశన సభ నుంచి ఎవరుగానీ ఈ జడ్జిమెంట్ కి వ్యతిరేకంగా అప్పీల్ చేయకుండా.. జడ్జిమెంట్ ని అమలుచేయడంలేదో ఆ విషయమై గవర్నర్‌ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా ఎవరూ కూడా హైకోర్టు ఆదేశాలను పట్టించుకోవడంలేదు అని అన్నారు. గవర్నర్‌ గా మీకు కొన్ని పవర్స్ ఉన్నాయి.. హైకోర్టు జడ్జిమెంట్ ను ప్రభుత్వం, శాసనసభ అమలుచేసే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ కు విజ్ఞప్తి చేసాం అని అన్నారు. అసెంబ్లీలో జరిగిన ఘటనకు సంబంధించి హైకోర్టుకు వీడియో ఫుటేజి ఇస్తానని చెప్పిన తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు సమర్పించలేదని  తెలిపారు. ప్రతిపక్షాలు లేకుండా బడ్జెట్ సమావేశాలు జరిగిన చరిత్ర ఎప్పుడూ లేదని అన్నారు. రాజ్‌భవన్‌కు వచ్చిన సంపత్ కుమార్ లోపలికి వెళ్లకుండా బయటే ఉండిపోవటం గమనార్హం.