కోలుకుంటున్న మాజీ ప్రధాని

కోలుకుంటున్న మాజీ ప్రధాని

అస్వస్థతతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న మాజీ ప్రధాని వాజ్‌పేయి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యుల బృందం ప్రకటించింది. ఇవాళ ఉదయం ప్రత్యేక హెల్త్‌ బులెటిన్‌ను విడుదల చేసిన వైద్యుల బృందం.. వాజ్‌పేయి పూర్తిస్థాయిలో కోలకుకుంటున్నారని తెలిపారు. మూత్ర సంబంధ వ్యాధితో వాజ్‌పేయి బాధపడుతున్నట్టు వివరించారు. మరోవైపు మాజీ ప్రధాని ఆరోగ్య పరిస్థితిపై విదేశాల్లో ఉన్న ప్రధాని మోడీసహా కేంద్ర మంత్రులు, కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ అడిగి తెలుసుకుంటున్నారు.