వక్కంతం వంశీకి స్టార్ హీరో  ఛాన్స్  

వక్కంతం వంశీకి స్టార్ హీరో  ఛాన్స్  

వక్కంతం వంశీ, అల్లు అర్జున్ తో నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యారు. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక బాక్స్ ఆఫీస్ వద్ద చతికిల పడింది. ఇక తాజా అందుతున్న సమాచారం ప్రకారం రవి తేజను డైరెక్ట్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. మాస్ మహా రాజ్ శైలికి తగ్గట్లు ఓ కథను రెడీ చేసే పనిలో వంశీ పడ్డాడట. 

గతంలో రవితేజ చేసిన కిక్ సినిమాకు వక్కంతం వంశీనే కథ సమకూర్చారు. ఆ సినిమా మంచి విజయం సాధించడంతో అప్పటి నుండి వీరిద్దరికి మంచి బాండింగ్ ఏర్పడింది. దీని మూలానే రవి తేజతో సినిమా చేసే ఛాన్స్ వచ్చిందని తెలుస్తోంది. ప్రస్తుతం రవి తేజ, శ్రీను వైట్ల దర్శకత్వంలో అమర్ అక్బర్ ఆంటోని సినిమాను చేస్తున్నారు. ఇది పూర్తయ్యాక మరో రెండు సినిమాలకు కమిట్మెంట్ ఇచ్చారు. బహుశా ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయితే వక్కంతం వంశీతో సినిమా ఉంటుందని సమాచారం.