కాంగ్రెస్‌లోకి టీడీపీ కీలక నేత

కాంగ్రెస్‌లోకి టీడీపీ కీలక నేత

తెలంగాణ టీడీపీ సీనియర్‌ నేత వంటేరు ప్రతాప్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరబోతున్నారు. ఈ నెల 11న ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సమక్షంలో దేశ రాజధానిలో 'హస్తం' తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలిసింది. ఆయనతోపాటు భారీ సంఖ్యలో కార్యకర్తలు కూడా కాంగ్రెస్‌లో చేరబోతున్నారని సమాచారం. వంటేరు ప్రతాప్‌రెడ్డి గత ఎన్నికల్లో గజ్వేల్‌లో కేసీఆర్‌పై పోటీ చేసి.. గట్టి పోటీ ఇచ్చారు. అదే నియోజ‌క‌వ‌ర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీచేసిన న‌ర్సారెడ్డి ఆ త‌ర్వాత టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ నేప‌థ్యంలో గ‌జ్వేల్ లో మంచి నాయకుడి కోసం వెతుకుతున్న కాంగ్రెస్.. వంటేరు చేరికతో బలేపేతం అవుతుందని పలువురు భావిస్తున్నారు.