మోదీ సర్కార్‌కు దళితుల సెగ తప్పదు!

మోదీ సర్కార్‌కు దళితుల సెగ తప్పదు!

నరేంద్ర మోదీ ప్రభుత్వం దళితుల ఆగ్రహానికి గురికాబోతోందని జోస్యం చెప్పారు ఆంధ్రప్రదేశ్‌ ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య... ఎస్సీ, ఎస్టీ, ప్రివెన్షన్ చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి కేంద్రం కుట్ర పన్నిందని ఆరోపించిన ఆయన... ఈ చట్టం అమలు చేయకపోతే దళితులకు అన్యాయం జరుగుతుందన్నారు. దీని కోసం టీడీపీ దళిత ఎంపీలు, ఛైర్మన్లు రాష్ట్రపతిని కలిసేందుకు వెళ్లనున్నట్టు తెలిపారు. అగ్రకుల దురహంకారానికి కొమ్మకాసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డ వర్ల... దర్యాప్తు లోపం వల్ల ఎస్సీ, ఎస్టీ కేసులు తీవ్ర జాప్యం జరుగుతున్నాయన్నారు. జగన్ ఎస్సీ, ఎస్టీ చట్టంపై ఎటువంటి వ్యాఖ్యలు చేయకపోవడం దురదృష్టకరమని... జగన్ కు దళితుల ಓట్లు కావాలి... కానీ, వారి సంక్షేమం పట్టదని ఆరోపించారు. 

ఒక తండ్రి కొడుకును మందలించిన విధంగానే నేను బందరులో ఆర్టీసీ బస్సులో ఉన్న యువకుడిని మందలించానన్నారు ఏపీ ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య... తాజాగా ఆర్టీసీ చైర్మన్‌గా అధికారుల పని తీరును పర్యవేక్షించే సమయంలో కాలక్షేపం కోసం బస్సులో పాటలు వింటున్న యువకుడిపై అభ్యంతరక పదజాలం ఉపయోగించిన వివాదాల్లో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. వర్ల రామయ్య వ్యాఖ్యలు దుమారమే రేపాయి... కాలక్షేపం కోసం తన ఫోన్లో పాటలు వింటున్న యువకుడిపై అనుచిత పదజాలం ఉపయోగించడంతో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఘటనపై వివరణ ఇచ్చిన వర్ల రామయ్య... ఒక తండ్రిలా మందలించా... ఆ సందర్భంలో కొన్ని అసభ్యపదాలు ఫోన్లలో వచ్చినందుకు నేను చింతిస్తున్నా అన్నారు.