సీవీసీని కలిసిన వర్మ, ఆస్తానా

సీవీసీని కలిసిన వర్మ, ఆస్తానా

సీబీఐ డైరెక్టర్ ఆలోక్ వర్మ, స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ ఆస్తానా.. సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ కేవీ చౌదరిని కలిశారు. సీబీఐ టాప్ బాసులపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. వర్మపై ఆస్తానా ఆరోపణలు చేయడం, మరోవైపు సీబీఐ వర్సెస్ సీబీఐ అన్నట్టుగా పరిస్థితి తయారైంది. కేంద్ర ప్రభుత్వం అకస్మాత్తుగా ఇద్దరినీ బాధ్యతల నుంచి తప్పించడంతో వర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీన్ని విచారణకు చేపట్టిన సుప్రీంకోర్టు.. రెండు వారాల్లోగా విచారణ ముగించాలని గత నెల 26న సీవీసీని ఆదేశించింది. ఆ విచారణలో భాగంగా ఇవాళ వర్మ, ఆస్తానా సీవీసీ ముందు హాజరయ్యారు. దాదాపు ఓ గంటసేపు చౌదరితో భేటీ అయ్యారు.