మరో కొత్త ఫోటోను రిలీజ్ చేసిన వర్మ

మరో కొత్త ఫోటోను రిలీజ్ చేసిన వర్మ

రామ్ గోపాల్ వర్మ స్పీడ్ పెంచాడు.  లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను తీస్తున్నట్టు తిరుపతిలో ప్రకటించిన వర్మ ఆ తరువాత కొన్ని రోజులు సైలెంట్ గా ఉన్నాడు.  కారణాలు ఏంటో తెలియదు. ఆ తరువాత కొంతకాలానికి, షూటింగ్ స్టార్ట్ అయిందని, చాలా వరకు సినిమా కంప్లీట్ అయిందని చెప్పిన వర్మ అందులో ఎవరెవరు నటిస్తున్నారని విషయాన్ని రహస్యంగా ఉంచారు.  

ఈ రహస్యాన్ని ఒక్కొక్కటిగా విప్పుతూ.. ఆ సినిమాలో నటించే వ్యక్తుల వివరాలను బయటపెడుతున్నాడు.  కొద్దిసేపటి క్రితం లక్ష్మి పార్వతి రోల్ కు సంబంధించిన విషయాలను బయటపెట్టిన వర్మ, ఇప్పుడు మరో ఫోటోను ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు.  సినిమాలో ఈ నటుడి పాత్ర కీలకం అని చెప్తూనే.. ఈ ఫోటోని వ్యక్తి ఏ పాత్రను చేస్తున్నారో చెప్పుకోండి చూద్దాం అంటూ పజిల్ ను విసిరారు.  ఫొటోలో ఉన్న వ్యక్తి ఏ పాత్ర చేస్తున్నారో వర్మ చెప్తేనే బాగుంటుందేమో..