ఇంతకుముందు ఎప్పుడు చూసుండరు 

ఇంతకుముందు ఎప్పుడు చూసుండరు 

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం స్పెస్ థ్రిల్లర్ జోనర్ లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కొద్ది రోజుల క్రితమే మొదలైంది. నిన్ననే దాదాపు 35 రోజుల పాటు జరిగిన నిరవధిక షెడ్యూల్ పూర్తయింది. అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈ సినిమా కోసం వేసిన భారీ సెట్ లో ఈ షూటింగ్ జరిగింది. 

దీని గురించి వరుణ్ తేజ్ మాట్లాడుతూ ఇంతకు ముందెన్నడూ స్క్రీన్ మీద చూడని సన్నివేశాలని ఈ సినిమాలో చూడబోతున్నాం. చాలా కష్టపడి ఆ సీన్స్ ను తెరకెక్కించాం. క్రియేటివ్ గా, ఫీజికల్ గా చాలా ఎంతో శ్రమతో తీశాం. ఈ షెడ్యూల్ కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా పనిచేశారని తెలిపారు. ఇందులో కొన్ని కీలక సన్నివేశాలను జీరో గ్రావిటీ వాతావరణంలో షూట్ చేశారు. ఈ చిత్రంలో అధితి రావు హైదరి, లావణ్య త్రిపాఠిలు హీరోయిన్స్ గా నటిస్తన్నారు. గతంలో సంకల్ప్ రెడ్డి తీసిన ఘాజీ చిత్రం మంచి విజయం సాధించిన నేపథ్యంలో ఈ ప్రాజెక్టుపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సైన్స్ ఫిక్షన్ సినిమాను రాజీవ్ రెడ్డి, క్రిష్ లు నిర్మిస్తున్నారు.