యువ దర్శకుడికి వెంకీ మరో ఛాన్స్ !

యువ దర్శకుడికి వెంకీ మరో ఛాన్స్ !

'గురు' సినిమా తర్వాత చాలా రోజులు గ్యాప్ తీసుకున్న వెంకటేష్ తాజాగా 'ఎఫ్ 2' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు.  12వ తేదీన విడుదలైన ఈ సినిమాలో ఆయన కామెడీ టైమింగ్ చూసిన జనమంతా వింటేజ్ వెంకీ ఈజ్ బ్యాక్ అంటున్నారు.  వెంకీ కూడ ఎంటర్టైన్మెంట్ కలిగిన స్క్రిప్ట్ దొరికేసరికి తన సత్తా ఏమిటో చూపించి థియేటర్లలో నవ్వుల పూవులు పూయించాడు.  ఈమధ్య కాలంలో వెంకీకి ఈ రేంజ్ సక్సెస్ దక్కలేదు.  అందుకే ఈ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడితో ఇంకో సినిమా చేయాలని ఆయన డిసైడయ్యారట.  త్వరలోనే సినిమాను అధికారికంగా అనౌన్స్ చేస్తారని తెలుస్తోంది.