సుప్రీంకు చేరిన టీటీడీ వివాదం 

సుప్రీంకు చేరిన టీటీడీ వివాదం 

తిరుమల తిరుపతి దేవస్థానం వ్యవహారం ఇపుడు దేశ అత్యున్నత న్యాయస్థానానికి చేరింది. తనను అర్చక పదవి నుంచి తొలగించడం అన్యాయమని, దీనిపై సుప్రీంకు వెళతానని రమణ దీక్షితులు చెబుతుండటంతో... ఆయనకంటే ముందే  సుప్రీంకోర్టును టీటీడీ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో వేణుగోపాల దీక్షితులు తరఫున న్యాయవాది కేవియెట్ పిటిషన్ దాఖలు చేశారు. అక్రమంగా తనను అర్చక పదవినుంచి తొలగించారని, స్వామివారి ఆభరణాలు కనపడటం లేదని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తానని పదే పదే మీడియా ముందు రమణదీక్షితులు అన్నారు. టీటీడీ దేవస్థానంలో వేణుగోపాల దీక్షితులను ప్రధాన అర్చకునిగా నియమిస్తూ టీటీడీ బోర్డు ఇచ్చిన జీవో ని వ్యతిరేకిస్తూ ఎవరైనా కోర్టులో పిటీషన్‌ వేస్తే... తన వాదన విన్న తరవాతే తదుపరి ఉత్తర్వులు ఇవ్వాలని వేణుగోపాల దీక్షితులు కేవియట్ దాఖలు చేశారు.