ఖమ్మం నుంచి బరిలోకి వీహెచ్

ఖమ్మం నుంచి బరిలోకి వీహెచ్

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ తరఫున లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ గాంధీభవన్ లో కొనసాగుతోంది. స్వీకరణ కార్యక్రమం మొదలైన తొలి రోజు 30కిపైగా దరఖాస్తులు అందాయి. మరో రెండ్రోజుల పాటు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగనుంది. ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం నుంచి  పోటీ చేసేందుకు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావు దరఖాస్తు చేసుకున్నారు. నాగర్‌కర్నూలు నుంచి మల్లు రవి, నల్లగొండ నుంచి పటేల్‌ రమేష్‌ రెడ్డి, వరంగల్‌ నుంచి ఇందిరా, మహబూబాబాద్‌ నుంచి బెల్లయ్య నాయక్‌, బలరాంనాయక్‌, మల్కజ్ గిరి నుంచి మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజయ్య దరఖాస్తు చేసిన వారిలో  ఉన్నారు.