వావ్.. విజయ్ దేవరకొండ రేంజ్ 40 కోట్లు !

వావ్.. విజయ్ దేవరకొండ రేంజ్ 40 కోట్లు !

కెరీర్ తొలినాళ్లలోనే 40 కోట్ల మార్కెట్ ను అందుకోవడమంటే స్టార్ హీరోల కుమారులకు కూడ కొంత కష్టమే.  అలాంటిది యువ హీరో విజయ్ దేవరకొండ కేవలం మూడే సినిమాలతో ఆ 40 కోట్ల మార్కెట్ ను దాటేశాడు.  

ఆయన నటించిన తాజా చిత్రం 'గీత గోవిందం' మొదటి వారంలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 40 కోట్లకు పైగానే షేర్ ను వసూలు చేసింది.  ఇక రాబోయే వీకెండ్ లో కలెక్షన్స్ మెరుగ్గానే ఉంటాయి కాబట్టి ఈ మొత్తం 45 నుండి 50 కోట్ల మధ్యలో ఉండే అవకాశాలున్నాయి.  పరశురామ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ 2 సంస్థ నిర్మించింది.