ట్రైలర్ టాక్ : విజయ్ నోటా.. ప్రతి నోట.. !!

ట్రైలర్ టాక్ : విజయ్ నోటా.. ప్రతి నోట.. !!

గీత గోవిందం తరువాత మరోసంచలనం సృష్టించేందుకు విజయ్ దేవరకొండ సిద్ధం అవుతున్నాడు.  స్టూడియో గ్రీన్ పతాకంపై ఆనంద్ శంకర్ దర్శకత్వంలో నోటా అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.  తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతుంది.  పూర్తి స్థాయి రాజకీయాల గురించి ఈ సినిమా ఉండబోతున్నది.  దీనికి సంబంధించిన ట్రైలర్ ఈరోజు రిలీజ్ అయింది. డ్రింక్ చేస్తూ.. పబ్ ల్లో ఎంజాయ్ చేస్తూ, ఎక్కువ సమయం వీడియో గేమ్స్ ఆడుతూ కూర్చునే యువకుడిని తీసుకొని వచ్చి సీఎం కుర్చీలో కూర్చోపెడితే ఎలా ఉంటుంది.  రాజకీయాల గురించి అసలు తెలియని యువకుడు రాజకీయాల్లో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడు.  స్వార్ధ పూరితమైన రాజకీయాలను విజయ్ తనకు అనుకూలంగా ఎలా మార్చుకున్నాడు అనే సారాంశంతో కూడిన ట్రైలర్ రిలీజ్ చేశారు.  ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉంది.  ముఖ్యమంత్రి కాబోయే ముందు.. విజయ్ పబ్ లో ఎంజాయ్ చేస్తూ.. అమ్మాయిల ముద్దుల్లో మునిగితేలుతూ ఉంటాడు.  విజయ్ దేవరకొండ సినిమాల్లో ముద్దు కామన్ పాయింట్ గా మారింది.  విజయ్ ని బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ తో పోలుస్తున్నారు.  సత్యరాజ్, నాజర్ ల మధ్య జరిగే రాయకీయ యుద్ధంలోకి విజయ్ ఎలా వచ్చాడు ఎందుకు వచ్చాడు అనే చిన్న సీన్ ను ట్రైలర్ లో చూపించారు.  మెహ్రీన్ జర్నలిస్ట్ గా నటిస్తున్నది.  మొత్తానికి విజయ్ దేవరకొండ నోట ట్రైలర్ అదిరిపోయిందని ప్రతినోట వినిపిస్తున్నది.