రౌడీ.. పొలిటీషియన్.. లీడర్ కూడా !

 రౌడీ.. పొలిటీషియన్.. లీడర్ కూడా !

ఆనంద్ శంకర్ డైరెక్షన్లో విజయ్ దేవరకొండ నటించిన చిత్రం 'నోటా'.  ఆరంభం నుండి ఆసక్తిరేపుతున్న ఈ పొలిటికల్ థ్రిల్లర్లో విజయ్ మూడు భిన్నమైన షేడ్స్ లో కనిపించనున్నాడు.  ముందుగా రౌడీలా కనిపించే విజయ్ పొలిటీషియన్ గా మారి ఆ తర్వాత లీడర్ గా పరివర్తన చెందే క్రమమే ఈ చిత్రం. 

కొద్దిసేపటి క్రితమే విడుదలైన ఈ చిత్ర వీడియోలోని విజువల్స్ సినిమాపై ఆసక్తిని ఇంకాస్త పెంచేలా ఉన్నాయి.  రేపు సాయంత్రం 4 గంటలకు సినిమా టీజర్ విడుదలకానుంది.  తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ చిత్రంలో మెహ్రీన్ ప్రిజాద కథానాయకిగా నటించింది.    

'నోటా' స్నీక్ పీక్ వీడియో కొరకు క్లిక్ చేయండి