చివరి దశల్లో నోటా 

చివరి దశల్లో నోటా 

విజయ్ దేవరకొండ, అర్జు రెడ్డి ఘన విజయం తరువాత వరుసగా సినిమాలు ఒప్పేసుకున్నారు. ఒకదాని తరువాత ఒకటి మెల్లగా ఫినిష్ చేస్తూ కెరియర్ ను బిల్డ్ చేసుకుంటున్నాడు. ఈ ఏడాది మార్చిలో తమిళ దర్శకుడు ఆనంద్ శంకర్ దర్శకత్వంలో ఈ చిత్ర్రాన్ని మొదలెట్టిన సంగతి తెలిసిందే. ఓపెనింగ్ నాడే రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లిన ఈ చిత్రం నిరవధికంగా షూటింగ్ జరుపుకుంటోంది. 

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఆఖరి షెడ్యూల్ చెన్నైలో ప్రత్యేకంగా వేసిన సెట్స్ లో జరుగుతోంది. ఒక్కసారి టాకీ పార్ట్ పూర్తయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులను మొదలెట్టనున్నారు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ రాజకీయ నాయకుడిగా కనిపించనున్నారు. ఇదివరకే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుని..యువతను బాగా ఆకట్టుకుంది. మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను తెలుగు, తమిళం భాషలలో స్టూడి గ్రీన్ నిర్మిస్తోంది. మరోవైపు విజయ్ తాజాగా నటించిన టాక్సీ వాలా చిత్రం గ్రాఫిక్ వర్క్ కారణంగా వాయిదా పడింది.