వైరల్ అవుతున్న సైరా ఫోటోలు

వైరల్ అవుతున్న సైరా ఫోటోలు

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా  ప్రస్తుతం జార్జియాలో షూటింగ్ జరుపుకుంటున్నది.  ఈ సినిమాలో జార్జియా ఎపిసోడ్ కోసం ఏకంగా చిత్ర నిర్మాత రామ్ చరణ్ రూ.50 కోట్లు ఖర్చు చేస్తున్న సంగతి తెలిసిందే.  దాదాపు 500 మంది ఈ షూటింగ్ లో పాల్గొంటున్నారు.  మెగాస్టార్ ఇప్పటికే ఈ జార్జియాలో ఉండగా, మిగతా నటులైన జగపతిబాబు, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతిలు కూడా షూటింగ్ లో జాయిన్ అయ్యారు.  విజయ్ సేతుపతి సైరాకు నమ్మినబంటుగా నటిస్తుండగా.. సుదీప్ అవకు రాజుగా నటిస్తున్నారు.  షూటింగ్ సమయంలో సుదీప్, విజయ్ సేతుపతిలు సెల్ఫీ దిగి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.  ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవడంతో పాటు.. వైరల్ గా మారింది.