కేసీఆర్ పై నిప్పులు చెరిగిన రాములమ్మ

కేసీఆర్ పై నిప్పులు చెరిగిన రాములమ్మ

మహబూబ్ నగర్ లో జరిగిన కాంగ్రెస్ పార్టీ ప్రచార యాత్రలో స్టార్ క్యాంపెనర్ విజయశాంతి టీఆర్ఎస్ పై నిప్పులు చెరిగారు. ఉద్యమ సమయంలో ఉన్న కేసీఆర్.. ప్రభుత్వంలో ఉన్న కేసీఆర్ వేరు అని ఆరోపించారు. నాలుగున్నరేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ దోపిడికి గురైందని ధ్వజమెత్తారు. పదవులు, డబ్బు శాశ్వతం కాదు...ప్రజలకు సేవే నాకు ముఖ్యమని ఆమె స్పష్టం చేశారు.

తెలంగాణ వచ్చిన తరువాత 4,000మంది చనిపోయారు. దీని కప్పిపుచ్చుకునేందుకే రైతు బందు, రైతు భీమా. ఇప్పటికీ తెలంగాణ పరిపాలన ఏంటో ప్రజలకు అర్థం కావడం లేదు. మీ ప్రభుత్వంలోని మంత్రి వర్గంలో ఒక్క మహిళ కూడా లేరు. కేసీఆర్ అబద్ధాల కోరు ... నోరు తెరిస్తే అన్ని అబద్ధాలే. నువ్వు చెప్పేవి ఎవ్వరు నమ్మే పరిస్థితి లేదు ఇప్పుడు. 2018 నా తెలంగాణ ప్రజలు కేసీఆర్ ను మోసం చేసి కాంగ్రెస్ రుణం తీర్చుకుంటారు. టీఆర్ఎస్ వస్తే వర్షాలు రావు. కారణం కేసీఆర్ పాదం. చేతకాని కేసీఆర్ గద్దె దించే రోజు దగ్గరలో ఉంది. అని విజయశాంతి మండిపడ్డారు.