ఇబ్రహీంపట్నంలో భారీగా గంజాయి పట్టివేత

ఇబ్రహీంపట్నంలో భారీగా గంజాయి పట్టివేత

ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ సమీపంలో ఈరోజు పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో నార్కో డ్రగ్స్ టీం పోలీసులు గంజాయి తరలిస్తున్న రెండు లారీలను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ఆ గంజాయి ఉన్న రెండు లారీలను ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ మధ్య విజయవాడ యువతను లక్ష్యంగా చేసుకొని భారీగా గంజాయిని తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో నిన్న విజయవాడ పీసీ గౌతం సవాంగ్ కొన్ని ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి ఆ దిశగా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆ మరుసటి రోజే భారీస్థాయిలో గంజాయిని గుర్తించడం విశేషం.