రవి ధర్నా, వంగవీటి రాధా మద్దతు

రవి ధర్నా, వంగవీటి రాధా మద్దతు

విజయవాడలో కాకాని వెంకటర్నతం విగ్రహం తొలగింపునకు నిరసనగా మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి చేస్తున్న ధర్నా మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా మద్దతు తెలిపారు. ఆందోళన చేస్తున్న రవికి మద్దతు ఆయన వెళ్ళారు. రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా బెంజ్ సర్కిల్‌లోని  జైఆంధ్ర ఉద్యమ నేత కాకాని వెంకటరత్నం విగ్రహాన్ని అధికారులు తొలగించారు. విషయం తెలుసుకున్న రవి..వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని విగ్రహ తొలగింపును అడ్డుకున్నారు. అర్ధరాత్రి వేళ విగ్రహం ఎందుకు తొలగిస్తున్నారని అధికారులను ప్రశ్నించారు. ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా ఉండేందుకు  రాత్రి పూట విగ్రహాన్ని తొలగిస్తున్నామని అధికారులు చెప్పినా.. ఆయన అర్ధరాత్రి కుట్రలు పన్నడం ప్రభుత్వానికి అలవాటుగా మారిందని ఆరోపించారు. అధికారులను అడ్డుకోవడంతో రవిని పోలీసులు పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న వెంటనే రవి అభిమానులు, వైకాపా కార్యకర్తలు బెంజిసర్కిల్‌కు భారీ సంఖ్యలో చేరుకున్నారు. విషయం తెలిసిన వెంటనే వంగవీటి రాధా కూడా అక్కడికి వచ్చారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో భారీ ఎత్తున పోలీసులను మోహరించారు.