మొదలుకానున్న 'మహావీర్ కర్ణ' !

మొదలుకానున్న 'మహావీర్ కర్ణ' !

 

దక్షిణాది స్టార్ హీరో విక్రమ్ చేస్తున్న భారీ సినిమా 'మహావీర్ కర్ణ'.   సుమారు రూ.300 కోట్ల వ్యయంతో నిర్మితంకానున్న ఈ చిత్రాన్ని న్యూయార్క్ కు చెందిన యునైటెడ్ ఫిలిమ్స్ కింగ్డమ్ సంస్థ నిర్మించనుండగా ఆర్.ఎస్. విమల్ డైరెక్ట్ చేయనున్నాడు.  ఈ సినిమా యొక్క రెగ్యులర్ షూట్ త్వరలో హైదరాబాద్లో మొదలుకానుంది.  తమిళం, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ ప్రాజెక్టును సుమారు 32 అంతర్జాతీయ భాషల్లో విడుదలచేయనున్నారు.  ఈ చిత్రాన్ని 2019 ఆఖరుకి విడుదలచేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.