భారీ ధరకు విక్రమ్ సినిమా 

భారీ ధరకు విక్రమ్ సినిమా 

తమిళ నటుడు చియాన్ విక్రమ్ కు మన తెలుగునాట మంచి ఫాలోయింగ్ ఉంది. అపరిచితుడు సినిమాతో తెలుగులో తన కెరియర్ ను ప్రారంభించి తన వైవిధ్యమైన నటనతో ఇప్పటికి ఆ క్రేజ్ ను అలాగే కొనసాగిస్తున్నారు. ఈ హీరో తాజాగా నటించిన చిత్రం 'సామీ'. హరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందింది. 

విక్రమ్ ఇందులో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు. ఇది వరకే రిలీజ్ అయిన ట్రైలర్ కూడా పవర్ ప్యాక్డ్ గా ఉండడంతో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. డైరెక్టర్ హరి గత చిత్రల్లాగే ఇందులో కూడా కమర్షియల్ ఎలెమెంట్స్ కూడ మెండుగా ఉండటంతో ప్రీ రిలీజ్ బాగా జరిగింది. ఈ సినిమా హక్కులు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కలిపి దాదాపు 8 కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. బెల్లం రామకృష్ణ రెడ్డి, హరిలు ఈ చిత్ర హక్కులను సొంతం చేసుకోవడం విశేషం. ఈ సినిమాలో విక్రమ్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. త్వరలోనే ఈ సామీ చిత్రం ప్రేక్షకులను అలరించనుంది.