బ్యాట్ పట్టిన కోహ్లీ...

బ్యాట్ పట్టిన కోహ్లీ...

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ(29) మైదానంలోకి అడుగుపెట్టాడు. ఐపీఎల్-11లో బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న కోహ్లీ.. ఫీల్డింగ్ చేస్తుండగా మెడకు గాయమైంది. త్వరలో జరగనున్న ఇంగ్లాండ్ టూర్ కి సన్నాహంగా భావించి ఇంగ్లీష్ కౌంటీలు ఆడుదామని భావించిన కోహ్లీ.. మెడ గాయం కావడంతో ఆ కౌంటీలకు దూరమయ్యాడు. అయితే గాయమైన తరువాత రెండు వారాల్లోపే మళ్లీ బ్యాట్ పట్టి మైదానంలో అడుగెట్టాడు. టీమిండియా బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ ఆధ్వర్యంలో ముంబయిలోని బంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో బుధవారం కోహ్లీ ప్రాక్టీస్ చేశాడు. ఈ ప్రాక్టీస్ మరో వారం రోజుల పాటు జరగనుంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇండోర్ నెట్స్‌లో సాధారణ ప్రాక్టీస్‌లో పాల్గొంటున్నాడు. వచ్చే మూడు రోజుల్లో మైదానంలో కఠిన సాధనకు దిగుతాడు. జూన్ 15న బెంగళూరులో ఫిట్‌నెస్ టెస్టుకు హాజరవుతాడని బీసీసీఐ ప్రతినిధి తెలిపారు.

Photo: FileShot