ఈ క్రికెటర్లు రామాంజనేయులు..

ఈ క్రికెటర్లు రామాంజనేయులు..

బౌలర్ ఎవరైనా సరే పట్టించుకోకుండా మైదానంలో పరుగుల వరద పారించి అభిమానులను అలరించేవాడు భారత మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌. రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కూడా అభిమానులను అదేవిధంగా అలరిస్తున్నాడు టీమిండియా మాజీ ఓపెనర్. ఇదంతా మైదానంలో కాదండోయ్.. సోషల్ మీడియాలో. తాజాగా వీరేంద్ర సెహ్వాగ్‌ చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. క్రికెట్ దేవుడు సచిన్‌తో ఉన్న ఫొటోను ట్విట్టర్ వేదికగా షేర్ చేసాడు.

తాజాగా ఓ కార్యక్రమానికి సచిన్, సెహ్వాగ్‌లు హాజరైయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరు ఫొటోకి ఫోజిచ్చారు. ఆ ఫొటోనే సెహ్వాగ్‌ షేర్ చేసాడు. ఆ ఫొటోలో సచిన్ నిల్చొని సెహ్వాగ్‌ భుజంపై చెయ్యేసి నవ్వులు పూయిస్తుంటే.. సెహ్వాగ్ గదలాంటి దాన్ని పట్టుకుని సచిన్ ఎదురుగా మోకాలపై నిల్చోని ఉన్నాడు. 'దేవుడితో ఉన్నాను.. సచిన్ పాదాల దగ్గర ఉండటమే సరైంది' అని సెహ్వాగ్‌ రాసాడు. అంతేకాదు 'ఇది సుత్తి కాదు, గద. రామ్‌జీ, హనుమాన్‌జీ' అనే హ్యాష్ ట్యాగ్‌లు కూడా తగిలించాడు. ప్రస్తుతం సెహ్వాగ్‌ చేసిన ఈ ట్వీట్ నెట్టింట్లో తెగ షేర్ అవుతుంది. 

https://twitter.com/virendersehwag/status/1005645465369628673