విశాల్‌పై భాజ‌పా కుట్ర‌?

విశాల్‌పై భాజ‌పా కుట్ర‌?

హీరో విశాల్‌పై మోదీ ప్ర‌భుత్వం కుట్ర ప‌న్నిందా?  విశాల్ ఫిలింఫ్యాక్ట‌రీపై భాజ‌పా నేరుగా ఎటాక్ స్టార్ట్ చేసిందా? అంటే అవున‌నే తాజా స‌న్నివేశం చెబుతోంది. గ‌త కొంత‌కాలంగా త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో విశాల్ మంట‌లు పుట్టిస్తున్నాడు. భాజ‌పా, మోదీల‌కు వ్య‌తిరేకంగా .. త‌మిళ ప్ర‌జ‌ల‌కు అనుకూలంగా ప్ర‌త్య‌క్ష యుద్ధం చేస్తున్నాడు. ఇటీవ‌ల‌ కావేరీ జ‌లాల వివాదం విష‌యంలో, రైతుల స‌మ‌స్య‌ల విష‌యంలో విశాల్ నేరుగా కేంద్ర ప్ర‌భుత్వంపై పోరాడాడు. దిల్లీ వెళ్లి న‌డివీధుల్లో ఎన్డీయే ప్ర‌భుత్వాన్ని, పెద్ద‌ల్ని నిల‌దీశాడు. త‌మిళ ప్ర‌జ‌ల త‌ర‌పున పోరాడేందుకు తాను ఎల్ల‌పుడూ సిద్ధంగా ఉంటాన‌ని విశాల్ ప్ర‌క‌టించాడు. 

అయితే ఇది మోదీకి, భాజ‌పాకు చిర్రెత్తుకొచ్చేలా చేసింది. ఆ క్ర‌మంలోనే విశాల్ న‌టించి, నిర్మించిన `అభిమ‌న్యుడు` (ఇరుంబు తిరై) చిత్రంపై ఉక్కుపాదం మోపేందుకు భాజ‌పా ప్ర‌భుత్వం కుట్ర ప‌న్నింద‌ని అర్థ‌మ‌వుతోంది. ఈ సినిమాలో ముఖ్యంగా మోదీ విధానాల్ని విశాల్ నిల‌దీశాడు. జీఎస్టీ, డిజిట‌ల్ ఇండియా అంశాల్ని త‌ప్పుప‌డుతూ.. త‌ప్పుడు విధానాలు అంటూ సూచించే స‌న్నివేశాల్ని చూపించాడుట‌. దీంతో ఆయా స‌న్నివేశాల్ని తొల‌గించాల్సిందిగా కేంద్రం కోరింది. అయితే అదేమీ ప‌ట్టించుకోకుండా ఇరుంబు తిరై చిత్రాన్ని విశాల్ త‌మిళంలో రిలీజ్ చేశాడు. అయితే దీనిపై నిర‌సిస్తూ కొంద‌రు విశాల్‌పై దాడుల‌కు ప్ర‌య‌త్నించ‌డంతో, అత‌డు ర‌క్ష‌ణ కోసం పోలీస్ సాయం కోరాడు. ప్ర‌స్తుతం చెన్న‌య్‌లో విశాల్ ఇంటికి పోలీస్ ప‌హారా ఏర్పాటు చేశార‌ని తెలుస్తోంది. ఇక ఇరుంబు తిరై ఆడుతున్న థియేట‌ర్ల వ‌ద్ద భారీగానే బందోబ‌స్తు ఏర్పాటు చేశార‌న్న సంగ‌తి తెలిసిందే.