ఐటీ రంగానికి కేరాఫ్ వైజాగ్...

ఐటీ రంగానికి కేరాఫ్ వైజాగ్...

విశాఖ పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేష్... కాపులపాడ ఐటీ పార్క్ ని పరిశీలించారు... ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ ఐటీ రంగానికి కేరాఫ్ అడ్రాస్‌గా మారబోతోందన్నారు. మొదటి దశలో ఐటీ కార్యకలాపాలకు వంద ఎకరాలు అందుబాటులోకి వస్తుందని... 1400 ఎకరాల్లో కాపులపాడ ఐటీ పార్క్‌లో హౌసింగ్, స్కూల్స్... ఇతర మౌలిక వసతులు కూడా ఓకే చోట ఉండేలా సిద్ధం చేస్తున్నామని... నాలుగు దశల్లో కాపులపాడు ఐటీ పార్క్ అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని వెల్లడించారు మంత్రి నారా లోకేష్‌.

ఐటీ కార్యకలాపాలకు 700 ఎకరాలు అందుబాటులోకి వస్తుందని... ఒక్క కాపులపాడు ఐటీ పార్క్ లోనే సుమారుగా 5 లక్షల మంది ఐటీ రంగంలో పని చేసే అవకాశం ఉంటుందని తెలిపారు లోకేష్... వేగంగా జరుగుతున్న మౌలిక వసతుల కల్పన జరుగుతోందన్న మంత్రి... రోడ్లు, నీటి సరఫరా, విద్యుత్ ఇతర మౌలిక వసతుల కల్పన సెప్టెంబర్ లోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. 5 లక్షల మంది కాపులపాడులో ఉద్యోగాలు చేసే అవకాశం ఉంది కాబట్టి... దానిని దృష్టిలో పెట్టుకొని మౌలిక వసతుల కల్పన పూర్తి చేయాలన్న మంత్రి... కొండపై ఉద్యోగాలు చేసే వారికి అవసరం అయ్యే  హౌసింగ్ తో సహా ఇతర మౌలిక వసతుల కల్పనను ఇప్పటి నుండే సిద్ధం చేసుకోవాలన్నారు.