తుది ఓటర్ల జాబితా విడుదల...

తుది ఓటర్ల జాబితా విడుదల...

తుది ఓటర్ల జాబితాను విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల సంఘం... రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సిసోడియా ఈ ఓటర్ల జాబితాను విడుదల చేశారు. తుది జాబితా ప్రకారం రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 3 కోట్ల 69 లక్షల 33 వేల 91 మంది (3,69,33091) మంది. నేడు ఎన్నికల సంఘం వెబ్ సైట్‌తో తుది ఓటర్ల జాబితా చూసుకునే అవకాశం ఉంటుంది. తుది జాబితాలో పేరు లేనివారు కొత్తగా ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది ఎన్నికల సంఘం. ఈ  ప్రక్రియ నామినేషన్ల ప్రక్రియ ముగిసే వరకూ కొనసాగుతోందని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు.