ఓటర్ల పల్లె బాట.. సౌకర్యాలు లేక అవస్థలు..

ఓటర్ల పల్లె బాట.. సౌకర్యాలు లేక అవస్థలు..

తెలంగాణ ప్రజలు మొత్తం ఓటింగ్ మూడులోకి వెళ్లిపోయారు... రేపే ఎన్నికలు కావడంతో నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి గ్రామీణ ప్రాంతాల ఓటర్లు పల్లె బాట పట్టారు. హైదరాబాద్‌ నుంచి చుట్టు పక్కల ప్రాంతాలతో పాటు కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, కొత్తగూడెం, నల్లగొండ, ఖమ్మం జిల్లాలు ఇలా దూర ప్రాంతాలకు కూడా ప్రయాణం అవుతున్నారు. దీంతో బస్టాండులు కిటకిటలాడుతున్నాయి. కామన్ గా దసరా, దీపావళి, సంక్రాంతి పండగల సమయంలో ఉండే రద్దీ ఇప్పుడు బస్టాండ్లతో పాటు... ఉప్పల్, ఎల్బీనగర్ కూడళ్లలో, జూబ్లీహిల్స్ బస్టాండ్‌ ప్రయాణికులతో కిక్కిరిసి పోయాయి. ఇక స్కూళ్లు వరుసగా మూడు రోజులు సెలవులు ఇవ్వడం... ఆ తర్వాత ఆదివారం కావడంతో పెద్ద సంఖ్యలో విలేజ్‌కు తరలిపోతున్నారు.  ఇక బస్సులు సరిగా అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అసహనం వ్యక్తం చేస్తూ అధికారులతో వాగ్వాదానికి దిగారు.