తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్‌ శాతం ఇదే..

తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్‌ శాతం ఇదే..

తెలంగాణల ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం రాత్రి 11.45 గంటల గంటలకు అందిన సమాచారం మేరకు 69.1 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇది ఇంకా పెరగొచ్చని.. పోలింగ్ శాతానికి సంబంధించిన పూర్తి సమాచారం రావడానికి సమయం పడుతుందని ప్రకటించింది.

ఓట్ల గల్లంతు పై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయని.. కొంత మేరకు ఓట్ల గల్లంతు వాస్తవమేన్నారాయన. 'ఓటర్ లిస్టులో పేరు లేని వారు నన్ను క్షమించండి, మరోసారి పొరపాటు జరుగకుండా చూసుకుంటాం' అని రజత్‌ చెప్పారు. ఇక.. 754 ఈవీఎంలను మార్చాల్సి వచ్చిందన్న ఆయన. ఇబ్బందులు తలెత్తడంతో 1,.444 వీవీప్యాట్లను మార్చామని తెలిపారు. ఎన్నికల ప్రశాంతంగా జరిగేందుకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు చెప్పారు రజత్‌కుమార్‌.