చిరంజీవితో సినిమా చేయట్లేదు !

చిరంజీవితో సినిమా చేయట్లేదు !

'మహానటి' సినిమాతో మరోసారి ఫామ్లోకి వచ్చిన నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ఈ ఏడాది 'దేవదాస్' చిత్రంతో ప్రేక్షకుల్ని మెప్పించింది.  అయితే గత కొన్ని రోజులుగా ఈ బ్యానర్ తన తర్వాతి సినిమాను చిరంజీవితో చేయనున్నట్లు వార్తలు హడావుడి చేస్తున్నాయి. 

వీటిపై స్పందించిన సంస్థ మా తర్వాతి చిత్రం చిరంజీవితో చేస్తున్నామనే వార్త నిజం కాదు.  ఇప్పటికే చిరుతో 4 హిట్ సినిమాలు చేశాం.  5వది కూడ చేస్తాం.  అది కూడ సోలోగా చేస్తాం.  ఆ సినిమా మొదలైనప్పుడు మేమే సగర్వంగా ప్రకటిస్తాం అన్నారు.  ఇకపోతే చిరు తరవాతి చిత్రం కొరటాల దర్శకత్వంలో చేయనుండగా ఆ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాటనీ ఎంటెర్టైనమెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్నాయి.