పోలవరం నిర్మాణం ఓ చరిత్ర... లోకేష్

పోలవరం నిర్మాణం ఓ చరిత్ర... లోకేష్

సాధారణంగా ప్రాజెక్టులు కట్టాలంటే తరాలు మారిపోవడం ఆవవాయితీ.. కానీ పోలవరం కేవలం నాలుగేళ్లల్లో ఓ రూపుకు తీసుకు వచ్చిన ఘనత తమ ప్రభుత్వానిదని రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌ అన్నారు. 
అందరి సహకారంతో పోలవరం పనులు పరుగులు పెడుతున్నాయని,  దేశ చరిత్రలో ఏ ప్రాజెక్టు పనులు ఈ స్థాయిలో జరగడం లేదని ఆయన ఎన్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. పోలవరం నిర్మాణం జీవిత కాలంలో ఒక్కసారి మాత్రమే వచ్చే అవకాశం.. అది మాకు దక్కడం మా అదృష్టమని లోకేష్ చెప్పారు.  కేంద్రం వేస్తున్న కొర్రీలను ప్రస్తావిస్తూ... వాటన్నింటికీ సమాధానం చెబుతూనే ఉన్నామని, నిర్మాణం జాప్యమైతే  ప్రాజెక్టు వ్యయం పెరుగుతుందనే విషయాన్ని కేంద్రం గుర్తించాలని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చెబితే జరిగి తీరాల్సిందేనని,  పోలవరం నుంచి గ్రావిటీ ద్వారా 2019 నాటికి నీటిని అందించి తీరుతామని లోకేష్‌ ధీమా వ్యక్తం చేశారు.