అమరావతి అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం : ఈశ్వరన్

అమరావతి అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం :  ఈశ్వరన్

అమరావతి అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని సింగపూర్ మంత్రి ఈశ్వరన్ స్పష్టం చేశారు.అమరావతిలో వెల్ కం గ్యాలరీ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, మాస్టర్ ప్లానుకు అనుగుణంగా అభివృద్ధి కోసం తీసుకుంటున్న చర్యల్లో ఇది తొలి అడుగు అని అన్నారు.భూ సమీకరణకు సహకరించిన రైతులకు కృతజ్ఞతలు తెలిపారు.ప్రపంచ దేశాల్లో అమరావతికి గుర్తింపు వచ్చేలా వెల్కమ్ గ్యాలరీ నిర్మాణం ఉంటుందని ఈశ్వరన్ చెప్పారు. కేవలం సింగపూర్ దేశమే కాకుండా.. వివిధ దేశాల నుంచి పెట్టుబడులు వచ్చే దిశగా చర్యలు చేపడతామని తెలిపారాయన.