ఝాన్సీ కేసులో కీలకమైన వాట్సాప్ మెసేజ్‌లు..

ఝాన్సీ కేసులో కీలకమైన వాట్సాప్ మెసేజ్‌లు..

బుల్లితెర నటి ఝాన్సీ ఆత్మ హత్య కేసులో వాట్సాప్ చాటింగ్‌ కీలకంగా మారింది. ఝాన్సీ ఆత్మహత్య చేసుకున్న తర్వాత పోలీసులు ఆమె ఫోన్‌ను పరిశీలించారు. సూర్య అనే యువకుడితో ఝాన్సీ వాట్సాప్ చాట్ చేసినట్లు గుర్తించారు. మొత్తం 14 వాట్సాప్ మెసేజ్‌లను గుర్తించారు పోలీసులు. ఝాన్సీ చనిపోయే ముందు చివరిసారిగా సూర్యతోనే మాట్లాడినట్టు నిర్ధారించారు. మరోవైపు ఝాన్సీ మొబైల్‌లో వాట్సాప్ మెసేజ్‌లు ఉండగా సూర్య మాత్రం తన మొబైల్‌లో ఆ మెసేజ్‌లను డెలిట్ చేశాడు. ఝాన్సీ ఆత్మహత్యకు సూర్య వేధింపులే కారణమని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అయితే, ఝాన్సీ ఆత్మహత్య చేసుకుని 24 గంటలు గడిచినా ఈ కేసులో సూర్యను విచారించకపోవడంపై ఝాన్సీ కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.