కోహ్లీ, రోహిత్‌..  టీ20ల్లో ఎవరు బెస్ట్‌..?

కోహ్లీ, రోహిత్‌..  టీ20ల్లో ఎవరు బెస్ట్‌..?

విరాట్‌ కోహ్లీ..రోహిత్‌ శర్మ...ఇద్దరూ ఇద్దరే..! ఒంటి చేత్తో భారత్‌కు విజయాలనందించగల ఆటగాళ్లు. ఒకరేమో సొగసైన బౌండరీలకు పెట్టింది పేరు.. మరొకరేమో భారీ సిక్సర్లకు కేరాఫ్‌ అడ్రస్‌. మరి వీరిద్దరిలో ఎవరు బెస్ట్‌? ఈ ప్రశ్నకు జవాబు చెప్పడం కాస్త కష్టమే.. కాస్త కాదు.. చాలా కష్టం. 

పోనీ.. టీ20ల్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలో ఎవరు అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌..? ఇది కూడా కష్టమైన ప్రశ్నే. ఈ ప్రశ్నకు హర్భజన్‌ సింగ్‌ తనదైన శైలిలో తెలివిగా సమాధానమిచ్చాడు. 

'ఇద్దరూ అద్భుతమైన ఆటగాళ్లు. మ్యాచ్‌ విన్నర్లు. క్లాస్‌ బ్యాట్స్‌మన్లు. రోహిత్‌ వెరీ ట్యాలెంటెడ్‌. కోహ్లీ హార్డ్‌వర్కర్‌. రోహిత్‌తో పోలిస్తే విరాట్ కోహ్లీకి అంత టాలెంట్ లేదు. కానీ.. కష్టించేతత్వం, ఆటపై ఉన్న అంకిత భావం కోహ్లీని ఈ స్థాయిలో నిలబెట్టింది. కాబట్టి ఇద్దరిలో ఎవరు బెస్ట్ అనేది చెప్పలేం' అని అన్నాడు.