బిగ్ బాస్ 3 హోస్ట్ పై భారీ డైలమా..?

బిగ్ బాస్ 3 హోస్ట్ పై భారీ డైలమా..?

బాలీవుడ్ లో సూపర్ హిట్టైన రియాలిటీ షో బిగ్ బాస్ షో సౌత్ కు వచ్చింది.  సౌత్ లోని నాలుగు భాషల్లో ఈ షో రన్ అవుతున్నది.  టాలీవుడ్ బిగ్ బాస్ మంచి విజయాన్ని రేటింగ్ ను సొంతం చేసుకోవడంతో హోస్ట్ గా టాప్ స్టార్స్ ను తీసుకోవడానికి నిర్వాహకులు వెనకాడటం లేదు.  

బిగ్ బాస్ ఫస్ట్ షోకు హోస్ట్ గా ఎన్టీఆర్ వ్యవహరించారు.  ఎన్టీఆర్ తనదైన స్టైల్, టాకింగ్ తో బిగ్ బాస్ ను నడిపించి హిట్ అయ్యే విధంగా చూశారు.  రెండో సీజన్ కు నాని వ్యాఖ్యాతగా వ్యవహరించాడు.  కొన్ని చోట్ల మినహా అంతా బాగుండటంతో సెకండ్ సీజన్ కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.  త్వరలోనే మూడో షో రన్ కావాలి.  ఈ షోకు హోస్ట్ గా ఎవరిని తీసుకుంటారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. వెంకటేష్, చిరంజీవి, ఎన్టీఆర్ పేర్లు వినిపిస్తున్నాయి.  మరి వీరిలో ఎవరిని ఈ షో హోస్ట్ గా తీసుకుంటారో మరికొద్ది రోజుల్లోనే తేలిపోతుంది.