శ్రీదేవి సెట్టైంది.. సావిత్రి డౌటే..!!

శ్రీదేవి సెట్టైంది.. సావిత్రి డౌటే..!!

ఎన్టీఆర్ బయోపిక్ లో క్యాస్టింగ్ విషయంలో రోజుకో కొత్త న్యూస్ బయటకు వస్తున్నది.  ఎన్టీఆర్ లైఫ్ తో ఎన్నో పాత్రలు ముడిపడి ఉన్నాయి.  ముఖ్యంగా సినిమా రంగంలో ఆయనతో కలిసి నటించిన నటీనటులు అనేకమంది ఉన్నారు.  ముఖ్యమైన వ్యక్తుల పాత్రలను ఈ సినిమాలో చూపించబోతున్నారు.  బ్లాక్ అండ్ వైట్ కాలంలో రామారావు.. సావిత్రి జోడి ఎన్నో సినిమాల్లో కనిపించింది.  సావిత్రి తరువాత ఎక్కువ సినిమాలు శ్రీదేవితో చేశారు.  

ఎన్టీఆర్ బయోపిక్ లో శ్రీదేవి పాత్రకు రకుల్ ప్రీత్ సింగ్ సెట్టైంది.  రకుల్ తన డేట్స్ ను సర్దుబాటు చేసుకొని షూటింగ్ లో పాల్గొంటుంది.  సావిత్రి పాత్ర ఇప్పుడు డౌట్ గా మారింది.  సావిత్రి పాత్రలో మహానటి సినిమాలో నటించిన కీర్తి సురేష్ ను తీసుకుంటారనే వార్తలు వచ్చాయి.  ఇందులో ఎంతవరకు నిజం ఉన్నదో తెలియదు.  ప్రస్తుతానికి కీర్తి సురేష్ తెలుగు సినిమాలు ఏవి చేయడంలేదు.  తమిళ సినిమాలపైనే దృష్టి సారించింది. దర్శక నిర్మాతలు ఆమెను కన్విన్స్ చేసి ఒప్పిస్తారా లేదంటే సావిత్రి పాత్రకోసం మరో నటిని ఎంపిక చేస్తారా అన్నది తెలియాలి.