పాపం బన్నీకి కలిసిరావడం లేదు..!!

పాపం బన్నీకి కలిసిరావడం లేదు..!!
అల్లు అర్జున్ ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్న నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా బాక్సాఫీస్ వద్ద కుదేలయింది.  ఈ సినిమా కోసం అల్లు అర్జున్ భారీ ఎత్తున కసరత్తులు చేశాడు.  శరీరాన్ని బాగా కష్టపెట్టాడు.  ఇంత కష్టపడి సినిమా చేస్తే.. అల్లు అర్జున్ కు పేరు వచ్చింది తప్పించే వసూళ్ల పరంగా మాత్రం వెనుకబడిపోయింది.  కారణాలు ఏవైనా కావొచ్చు.. నాపేరు సూర్య సమయంలోనే బన్నీ మనం వంటి మంచి హిట్ ఇచ్చిన విక్రమ్ కుమార్ తో సినిమా చేయాలని అనుకున్నాడు.  దానికి తగిన కథను స్క్రిప్ట్ ను రెడీ చేసుకోమన్నాడు.  కానీ, ఇప్పటికి స్క్రిప్ట్ రెడీ కాలేదు.  విక్రమ్ తీసిన హలో పరాజయం పాలవ్వడంతో తొందర పెట్టకూడదు అనుకోని సమయం తీసుకొని మంచి స్క్రిప్ట్ రెడీ చేయమని చెప్పాడట.  ప్రస్తుతం బన్నీ కోసం స్క్రిప్ట్ ను రెడీ చేసే పనిలో విక్రమ్ తలమునకలై ఉన్నాడు.  
 
ఇదిలా ఉంచితే, నా పేరు సూర్య కు ముందు బన్నీ డీజే దువ్వాడ జగన్నాధం సినిమా చేశాడు.  సినిమా బాగున్నప్పటికి   వసూళ్ల  రేసులో వెనకబడిపోయింది.  ఇలా వరసగా రెండు పరాజయాలు రావడంతో బన్నీ ఢీలా పడ్డాడు.  ఎలాగైనా హిట్ కొట్టాలని తహతహలాడుతున్నాడు.  ఎలాగో విక్రమ్ తో సినిమా ఆలస్యం అవుతుంది కాబట్టి దువ్వాడ జగన్నాధం దర్శకుడు హరీష్ శంకర్ తో సినిమా చేయడానికి సిద్దమవుతున్నాడట బన్నీ.  దువ్వాడ పరాజయమైంది కాబట్టి ఆ మచ్చను చెరిపేసుకొని ఎలాగైనా హిట్ కొట్టాని చూస్తున్నాడు హరీష్ శంకర్.  అటు బన్నీకి, ఇటు హరీష్ కు ఈ సినిమా చాలా ముఖ్యమైంది. ఈ కాంబినేషన్ హిట్ కొడితే.. బన్నీ తిరిగి లైన్లోకి వచ్చినట్టే..