నేటి నుంచి మహిళల ప్రపంచ టీ20 టోర్నీ

నేటి నుంచి మహిళల ప్రపంచ టీ20 టోర్నీ

మహిళల ప్రపంచ టీ20 టోర్నీకి కరీబియన్‌ దీవులు ముస్తాబైంది. టోర్నీ ఫస్ట్ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సారథ్యంలోని భారత్‌ జట్టు న్యూజిలాండ్‌తో తలపడనుంది. ఇటీవల ఫామ్‌ను పరిగణనలోకి తీసుకుంటే భారత్‌ ఈ కప్‌లో ఫేవరెట్ల జాబితాలో నిలుస్తుంది. శ్రీలంకను ఓడించి.. సొంతగడ్డపై ఆస్ట్రేలియా-ఎపై గెలిచి భారత్ మంచి ఊపు మీదుంది‌. ప్రపంచ టీ20 టోర్నీ వార్మప్‌ పోటీల్లో బలమైన వెస్టిండీస్‌, ఇంగ్లాండ్‌లపై గెలవడం టీమ్‌ ఇండియా ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ భారత్‌ మునుపటికంటే మెరుగైంది. లెగ్‌స్పిన్నర్‌ పూనమ్‌ యాదవ్‌తో పాటు వెటరన్‌ జులన్‌ గోస్వామి రాణించడం జట్టుకు కీలకం. మొత్తం మీద పోటీ హోరాహోరీ సాగే అవకాశాలున్నాయి. ఈ మ్యాచ్‌ తర్వాత భారత్‌ ఈనెల 11న పాకిస్థాన్‌తో, 15న ఐర్లాండ్‌తో, 17న మూడుసార్లు ఛాంపియన్‌ ఆస్ట్రేలియాతో తలపడనుంది.