ఇండస్ట్రీ మొత్తం మెచ్చిన దర్శకుడు !

ఇండస్ట్రీ మొత్తం మెచ్చిన దర్శకుడు !

ఈమధ్య పరిశ్రమలోకి యువ దర్శకుల రాక బాగానే పెరిగింది.  కొత్త ఆలోచనలు, కొత్త తరహా స్టోరీ టెల్లింగ్ విధానాలతో యువ దర్శకులు దూసుకుపోతున్నారు.  ప్రేక్షకులు, సినీ పెద్దలు కొత్తవాళ్లను మనస్పూర్తిగా ఆశీర్వదిస్తున్నారు.  అందుకు సాక్ష్యమే గత వారం విడుదలైన 'కేరాఫ్ కంచరపాలెం' చిత్రం. 

వాస్తవిక కథ, కథనాలతో, నిజమైన జీవితం ఎలా ఉంటుందో తెరపై ఆవిష్కరించిన ఈ సినిమాను వెంకటేష్ మహా అనే కొత్త డైరెక్టర్ రూపొందించారు.  ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా రానా దగ్గుబాటి రిలీజ్ చేశారు.  ఈ చిత్రాన్ని ప్రత్యేక షోల ద్వారా హీరోలు, దర్శకులు, హీరోయిన్లు, నిర్మాతలు ఇలా చాలా మంది సినీ జనం వీక్షించారు.  చూసిన ప్రతి ఒక్కరు దర్శకుడ్ని మనస్ఫూర్తిగా అభినందించారు.  ఈ మధ్య కాలంలో ఇంతలా పొగడ్తలు అందుకున్న దర్శకుడు ఈయనే.  ఆ అభినందనలు సినిమాకు బోలెడంత బలాన్నిచ్చి విజయవంతం అయ్యేలా చేశాయి.