షకీలా 'శీలవతి' ఎందుకు ఆగినట్టు..

షకీలా 'శీలవతి' ఎందుకు ఆగినట్టు..

షకీలా సినిమా రిలీజ్ అవుతుంది అంటే కేరళలో పెద్ద హీరోల సినిమాలు కూడా ఆగిపోతాయి.  ఆమె సినిమాలకు అంత డిమాండ్ ఉంది.  అయితే,గత పదేళ్లుగా ఆమె సినిమాలు చేయడం లేదు.  తన 250 వ సినిమా శీలవతి ఇటీవలే పూర్తయింది.  ఇప్పుడు ఈ సినిమాకు సెన్సార్ అడ్డంకిగా మారింది.  శీలవతి అనే సినిమా టైటిల్ పై అభ్యంతరాలను వ్యక్తం చేశారు.  షకీలా సినిమాకు శీలవతి టైటిల్ యాప్ట్ కాదని, సినిమా టైటిల్ మారిస్తేనే.. సెన్సార్ కు అనుమతి ఇస్తామని కేంద్ర సెన్సార్ బోర్డు పేర్కొంది.  

సినిమా చూడకుండా టైటిల్ యాప్ట్ కాదని ఎలా చెప్తారని షకీలా వాదిస్తోంది.  షకీలా నటించిన సినిమా అయినంతమాత్రాన ఆ టైటిల్ ఎందుకు యాప్ట్ కాదో చెప్పాలని.. సినిమా చూసి టైటిల్ సరైనది కాదన్నా సమంజసంగా ఉంటుందని.. తన అభ్యర్ధనను మరోసారి పరిశీలించాలని సెన్సార్ బోర్డు ను కోరింది.  ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను యూనిట్ ప్రారంభించింది.  ఇప్పుడు సినిమా టైటిల్ చేంజ్ చేయడం అంటే ఇబ్బంది అవుతుందని నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.