కేరాఫ్ కంచరపాలెం రిజెక్ట్ కావడానికి కారణం..?

 కేరాఫ్ కంచరపాలెం రిజెక్ట్ కావడానికి కారణం..?

ఈ ఏడాది 200 లకు పైగా సినిమాలు రిలీజ్ అయ్యాయి.  ఇందులో కొన్ని మాత్రమే హిట్టయితే.. అందులోను అతి తక్కువ సినిమాలను మాత్రమే విమర్శకుల మెప్పును సైతం పొందాయి.  అందులో ఒకటి కేరాఫ్ కంచరపాలెం.  కంచరపాలెం అనే ఊరిలో జరిగిన కథ ఇది.  నాలుగు జంటల ప్రేమ కథ ఇది.  దర్శకుడు వెంకటేష్ మహా ఈ సినిమాను మలిచిన తీరు అద్భుతం.  సామాన్యుల దగ్గరి నుంచి సెలెబ్రిటీల వరకు అందరు సినిమాను మెచ్చుకున్నారు.  

ఈ సినిమాకు స్టేట్ లెవెల్లో అవార్డులు కూడా దక్కించుకుంది.  నేషనల్ అవార్డుల కోసం ఈ సినిమాను పంపగా.. అవార్డుల ఎంపికకు ఈ సినిమాను రిజెక్ట్ చేశారు. కారణం ఏమంటే.. ఈ సినిమాను ప్రొడ్యూస్ చేసింది ఒక ఎన్.ఆర్.ఐ మహిళా.  అమెరికాకు చెందిన ప్రవీణ పరుచూరి అనే అమెరికా గ్రీన్ కార్డు హోల్డర్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయడంతో సినిమాను రిజెక్ట్ చేశారు.  దీంతో సదరు నిర్మాత.. దర్శకుడికి క్షమాపణలు చెప్తూ ట్వీట్ చేసింది.