9 నెలలు ఉండగానే ఎన్నికలు ఎందుకు?

9 నెలలు ఉండగానే ఎన్నికలు ఎందుకు?

ప్రభుత్వానికి సమయం ఇంకా 9 నెలలు ఉండగానే కేసీఆర్ ఎన్నికలకు ఎందుకు వెళ్తున్నారో ప్రజలకు చెప్పాలని కాంగ్రెస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. జోగిపేటలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ, అద్దంకి దయాకర్, మందకృష్ణ మాదిగ, బెల్లయ్యానాయక్ పాల్గొన్నారు. ప్రజల్లో టీఆర్ఎస్ విశ్వాసాన్ని కోల్పోతున్నదని ఎన్నికల్లో గెలవలేం అన్న అభిప్రాయంతోనే ముందు జాగ్రత్తగా ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారని రాజనరసింహ అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా టీఆర్ఎస్ నిలబెట్టుకోలేదని, నాలుగేళ్లలో రెండు లక్షల కోట్ల అప్పు చేసిన ఘనత టీఆర్ఎస్ దే అన్నారు. ప్రతి ప్రాజెక్టులోనూ స్కాములకు పాల్పడి పర్సంటేజీలు దండుకుంటున్నారని, టీఆర్ఎస్ పాలనలో దళితులు అణిచివేయబడ్డారని దామోదర విమర్శించారు.