శ్రియ అలా దొంగచాటుగా ఎందుకు..?

శ్రియ అలా దొంగచాటుగా ఎందుకు..?

సెలబ్రిటీలు తిరుమల దర్శనానికి వచ్చి వెళ్తుంటారు.  అలా వారు తిరుమల వచ్చిన సమయంలో అక్కడ హడావుడి ఉంటుంది.  మీడియా కవరేజ్ చేసి పలురకాలైన ప్రశ్నలు అడుగుతుంటారు.  ఏదైనా తప్పుగా సమాధానం చెప్తే అదో తలనొప్పి.  చెప్పకుండా వెళ్ళిపోతే మీడియాలో రూమర్లు.  ఎందుకొచ్చిన తలనొప్పిలే అని చెప్పి చాలామంది రహస్యంగా తిరుమల దర్శించుకొని చడీచప్పుడు లేకుండా వెళ్లిపోతుంటారు.  

టాలీవుడ్ హీరోయిన్ శ్రియ కూడా అలా రహస్యంగా వచ్చి మీడియా కంటపడకుండా వెళ్లాలని అనుకుంది.  అనుకున్నది కానీ సాధ్యపడలేదు.  మొహానికి ముసుగు వేసుకొని తిరుమలేశుని దర్శించుకొని వెళ్తున్న సమయంలో మీడియాకు చిక్కింది.  ప్రశ్నలు అడిగేలోపే చెక్కేసింది.  శ్రియ ఎందుకని ఇలా రహస్యంగా ముసుగేసుకుని వెళ్ళిపోయింది అనే దానిపై ఇప్పుడు పలురకాలైన రూమర్లు వస్తున్నాయి.  

2008 లో శ్రియ తిరుమల వచ్చినపుడు ఓ వ్యక్తి ఆమె వెనుక ఉండి అసభ్యంగా ప్రవర్తించాడు.  ఆ సంఘటన తిరిగి పునరావృతం కాకూడదనే ఉద్దేశ్యంతో శ్రియ అలా చేసిందని కొందరు అంటుంటే.. ఇటీవలే రష్యా దేశానికి చెందిన వ్యక్తితో వివాహం జరిగిన తరువాత ఆ ఫోటోలను శ్రియ బయటపెట్టలేదు.  వివాహం గురించి కూడా ఆమె ఎక్కడా మాట్లాడకపోవడంతో.. దీనిపై మీడియా ప్రశ్నిస్తుందేమో అన్న సందేహంతో శ్రియ అలా ముసుగు వేసుకొని చల్లగా జారుకుందని వార్తలు వినిపిస్తున్నాయి.