వర్మ ఇంకా సైలెంట్ గా ఉన్నాడేంటి..!!

వర్మ ఇంకా సైలెంట్ గా ఉన్నాడేంటి..!!

బాలకృష్ణ ప్రధాన పాత్రలో ఎన్టీఆర్ బయోపిక్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  ఎన్టీఆర్ సినిమాల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.  ఎన్టీఆర్ సినిమాల్లోకి ఎలా వచ్చారు.  ఎందుకు వచ్చారు.  సినిమాల్లో ఎలా రాణించారు. స్టార్ గా ఎదగడం వెనుక పడ్డ కష్టం ఎలాంటిది అనే విషయాలను ఈ సినిమాలో చూపించారు.  సినిమా అద్భుతం అని ఎన్టీఆర్ అభిమానులు చెప్తుంటే.. ఎన్టీఆర్ కు నిజమైన నివాళి అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.  

లక్ష్మీపార్వతి మాత్రం ఈ సినిమా గురించి ఘాటు వ్యాఖ్యలు చేసింది.  బాలకృష్ణకు చంద్రబాబు అంటే భయం అని అందుకే సినిమాలో నిజాలు చూపించలేదని.  రెండో పార్ట్ లో కూడా నిజాలు చూపించలేరని చెప్పిన లక్ష్మి పార్వతి.. వర్మ ఒక్కరికే నిజాలు చెప్పే ధైర్యం ఉందని చెప్పారు.  ఎందుకు సాంగ్ రిలీజ్ తరువాత సినిమాపై నమ్మకం పెరిగిందని చెప్పింది.  ఇంతకు ఎన్టీఆర్ బయోపిక్ పై బహిరంగంగా వ్యాఖ్యలు వర్మ, బయోపిక్ సినిమా తరువాత ఇంతవరకు స్పందించలేదు.  ఎన్టీఆర్ కథానాయకుడిపై వర్మ ఎలాంటి కామెంట్స్ చేస్తారో అని అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.